రాజకీయాలకు దూరమైన బండ్లన్న… వారందరికీ క్షమాపణ చెబుతు పోస్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ తో పాటు మరికొన్ని సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అయితే రాజకీయాలు బెడ్స్ కొట్టడంతో అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ నటుడిగా సినిమాలలో రీఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ అప్పటినుండి అడపాద అడపా సినిమాలలో నటిస్తూ నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు.

బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వారి మీద నిప్పులు చేరుగుతు పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా తన రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బండ్ల గణేష్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ క్రమంలో బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ..
” నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల..వ్యాపారాల వల్ల.. నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.