రష్మికపై మహేష్ బాబుకి ఇలాంటి ఒపీనియన్ ఉందా..!

mahesh movie sarileru neekevvaru holds the highest trp rating three times consecutively

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు వరుస భారీ హిట్స్ అనంతరం తన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమా చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రమే “గుంటూరు కారం” అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

అయితే మహేష్ బాబు దీనికి ముందు నటించిన చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నేషనల్ క్రష్ రష్మికా మన్దన్నాతో మహేష్ బాబు నటించాడు. అయితే రష్మిక నటించిన తాజా బాలీవుడ్ చిత్రం “ఆనిమల్” తో ఇప్పుడు రాబోతుంది. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే మహేష్ బాబు స్పీచ్ లో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది.

తాను మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అప్పుడు లాస్ట్ లో మళ్ళీ వచ్చి హీరోయిన్ రష్మిక కోసం మర్చిపోయాను అని ఆమెకోసం చెప్పాడు. రష్మికని చూస్తే నిజంగా తనకి ఎంతో గర్వంగా ఉంది నువ్వు ఇపుడు ఇండియాలో చెయ్యని భాష లేదు నీకోసం ఒక కొత్త భాష సృష్టించాలి ఏమో అందులో కూడా నువ్వు నటిస్తావు నువ్వు ఇంకా మరింత స్థాయికి ఎదగాలని తాను కోరుకుంటున్నాను అని మహేష్ తెలిపాడు.

అయితే మహేష్ ఈ మాటల్లో తనకన్నా చిన్నదైన రష్మిక పట్ల ఎంత గౌరవంగా ఉన్నాడో అనేది మనం అర్ధం చేసుకోవాలి. దీనితో మహేష్ తన కో ఆక్టర్ అయ్యిన రష్మిక పట్ల ఈ తరహా ఒక అరుదైన ఒపీనియన్ ఉందని చాలా మంది ఊహించి ఉండరు. కాగా ఆనిమల్ చిత్రం ఈ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.