వర్మ…రేపు మళ్లీ కెలికే పోగ్రాం..గ్యాప్ ఇవ్వడట

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి..చంద్రబాబు నాయకుడుకి వ్యతిరేకంగా తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది అని చెప్పబడుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే తనదైన శైలిలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్ట్ లు చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు.

Avasaram Video Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | Sira Sri | Yagna Shetty

తొలి పాటలో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతీల మధ్య ప్రేమాను రాగాలను చూపించిన వర్మ రెండో పాటలో ఎన్టీఆర్ పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించిందన్న విషయాలను టార్గెట్ చేశాడు.

అవసరం అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్‌గా చూపించాడు.

వెన్నుపోటు పొడిచిన బాబు, ఎన్టీఆర్‌ పోయాక దండవేసి దండం పెడుతున్నాడని చురకలంటించాడు. కల్యాణ్ మాళిక్ సంగీత సారధ్యంలో విల్సన్‌ హెరాల్డ్ ఆలపించిన ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించారు. ఈ పాటతో పాటు రేపు (మార్చి 8) సినిమాకు సంబంధించి రెండో థియేట్రికల్‌ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్‌ గోపాల్‌ వర్మ.