రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఎనర్జిటిక్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న రామ్‌కు గతకొంతకాలంపాటు సరైన హిట్‌ పడటం లేదు. ఈ మధ్యన నక్కిన త్రినాధరావుతో కలిసి‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ పలకరించినా.. వర్కవుట్ కాలేదు ఆడలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టేపనిలో పడ్డాడు. క్యారక్టరైజేషన్ లో విభిన్నత చూపెట్టి ఆకట్టుకునే పూరి జగన్నాథ్‌తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేసారు.

తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’టైటిల్ తో వచ్చిన ఈ పోస్టర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. రామ్, పూరి కలయికలో మొదటి సారి సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని కూడా పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో రామ్‌.. తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసమే రామ్‌ తెలంగాణ యాసపై మరింత పట్టు సంపాదించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా న్యూ ఇయర్‌ విషెస్‌ కూడా తెలంగాణ యాసలో ఫన్నీగా చెప్పాడు. మరి ఈ సినిమా రామ్‌ సినీ కెరీర్‌కు ఏవిధంగా సహాయపడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతుంది, ఏ జోనర్ లో తెరకెక్కబోతుంది..? ఇతర నటీనటులెవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.