రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’: అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చేశారు. ఫలానా రోజు ఓపెన్ అవుతుంది..ఫలానా తారీఖే ఖరారు లాంచింగ్ అంటూ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటికి సమాధానంగా చిత్రయూనిట్.. అఫీషియల్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది.

ఇక ఈలాంచింగ్ డేట్ కు ఓ స్పెషాలిటీ ఉంది. 11-11-11న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 11వ నెల 11వ తారీఖు 11గంటలకు ఈ చిత్రానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ విడుదల చేసింది. ఇందులో ‘11 11 11’ అని చూపిస్తూ.. ఈ మూడు 11లు మూడు ‘R R R’లుగా మారడంను వీడియోలో చూపించారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

RRR Launch Date - NTR, Ram Charan | SS Rajamouli | #RRRLaunch