రాజకీయం నేర్చుకుంటున్న పూజా కుమార్

తెలుగు, తమిళ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తున్న పూజా కుమార్ ఇప్పుడు రాజకీయ పాఠాలను నేర్చుకుంటున్నదట . అమెరికాలో పుట్టి పెరిగిన పూజా కుమార్ 2000 సంవత్సరంలో “కాదల్ రోజావీ ” అనే సినిమాతో పరిచయం అయ్యింది . 2013లో కమలహాసన్ తో విశ్వరూపం చేసి బాగా పాపులర్ అయ్యింది . గత సంవత్సరం రాసేఖర్ తో గరుడ వేగ   అనే తెలుగు సినిమాలో నటించింది .

ఈ సంవత్సరం కమల్ హాసన్ తో విశ్వరూపం 2 చేసింది . ఈ మధ్య కాలంలో కమలహాసన్ తో బాగా సన్నిహితంగా ఉంటుంది . తాను  అమెరికాలో చదుకున్నప్పుడు రాజకీయ శాస్త్రం  ఒక సబ్జెక్టుగా ఉండేదని , కాబట్టి రాజకీయాల గురించి తెలుసునని చెప్పింది .

అయితే అమెరికా రాజకీయాలు ఎప్పుడు రెండు పార్టీల మధ్యనే ఉంటుందని , అయితే భారత దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని , వీటి గురించే ఇప్పుడు స్టడీ చేస్తున్నానని చెప్పింది .

ఇక తనకు సన్నిహితుడైన కమల్ గురించి మాట్లాడుతూ కమల్ సర్ రాజకీయాల్లో ఏ ఉద్దేశ్యంతో వస్తున్నాడో తెలియదు , ప్రజలకు ఏదైనా మంచి చెయ్యాలని మాత్రం నేను కోరుకుంటున్నా అని చెప్పింది .