లీక్ : ‘సాహో’లో ప్రభాస్ క్యారక్టర్,స్టోరీ లైన్ ఇదే

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి చిత్రం ఘన విజయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు హీరో ప్రభాస్. దాంతో ఆయన తదుపరి ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. బాహుబలిలాంటి పాత్ర చేసిన తర్వాత ప్రభాస్ ఏ పాత్ర చేస్తే తేలిపోకుండా ఉంటాడు. ఏ పాత్రతో మెప్పించగలడు అనేది గత కొంత కాలంగా మీడియాలో చర్చనీయాశంగా మారింది. అయితే వీటిన్నటిని పట్టించుకోకుండా ఆయన ‘సాహో’ చిత్ర షూటింగ్‌లో బిజీబిజీ అయ్యిపోయాడు. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దాంతో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో.. చాప్టర్ 1’ పేరుతో అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించి ఆనందపరిచింది.అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేశామని, వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మరో అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు. అక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఇంతకీ సాహోలో ప్రభాస్ ఏం చేస్తాడు, ఆయన క్యారక్టర్ ఏమిటి అనే టాక్ మొదలైంది.

ఈ విషయమై అందుతున్న సమాచారం మేరకు…సాహోలో ప్రభాస్…ఓ స్పైగా కనపడతాడు. ఆయన ఇండియా ప్రీమియర్ ఇంటిలిజెన్స్ ఏజెన్స్ రా తరుపున పని చేస్తూంటాడు. అంటే మనకు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్,సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్ చేసిన పాత్ర లాంటిదన్నమాట. అయితే వాళ్లలా డైరక్ట్ ఎప్రోచ్ ఉండదట. ఓ ట్విస్ట్ గా స్పై అనే విషయం రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఓ పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ ఆచూకి తియ్యటానికి దేశ,విదేశాలు తిరుగుతూ కూపీ లాగుతూ అందులో భాగంగా రకరకాల గెటప్స్ వేస్తూంటాడు అని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కెతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండి థ్రిల్ చేయబోతున్నారు. అందుకోసం కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి నిపుణులను రప్పించారు. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్‌ సినిమాకే హైలైట్‌ అంటున్నారు.