ఎన్టీఆర్ భారీకాయం ఫొటోలపై ట్రైనర్ వివరణ

తాజాగా ఎన్టీఆర్‌ లుక్‌ కు సంభందించిన ఫొటోలు ఫిలిం సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. రీసెంట్ గా అరవింద సమేత సినిమాలో సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌లో భారీ కాయంతో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వంద కేజీలకుపైగా బరువు పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఫొటోలు సైతం బయిటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చాయి.

అయితే ఈ ఫొటోల విషయమై ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ … లాయిడ్ స్టీవెన్స్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. ఆయన ట్వీట్ చేస్తూ…

 సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు ఇప్పటివి కాదు. అవి ఏడాది క్రితం ఫొటోలు. ఎన్టీఆర్ ప్రస్తుత లుక్ ఇది కాదు అన్నారు. దాంతో అంతా ఊపిరి పీల్చికున్నారు.

రాజమౌళి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌లపై భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.