RRR సినిమా మొదటి సీన్స్‌కే 60 కోట్లా?

RRR సినిమా మొదటి సీన్స్‌కే 60 కోట్లా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది.

బాహుబలిలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో 2020లో సినిమాను రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నారు రాజమౌళి. అయితే షూటింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్‌ కావటం లేదట.

కేవలం ఇద్దరు హీరోల పరిచయం సన్నివేశాల కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఓ హైబడ్జెట్ సినిమా తెరకెక్కించేంత మొత్తాన్ని ఇంట్రడక్షన్‌ సీన్స్‌కే పెడితే ఇక క్లైమాక్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్‌.