మోక్షజ్ఞ గురించి మళ్లీ చర్చ , క్లారిటీ ఇచ్చేవాళ్లే కరవు

తన కుమారుడు త్వరలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నట్టు.. హీరో నందమూరి బాలకృష్ణ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ అది కార్యరూపం దాల్చలేదు. కానీ తాజాగా మోక్షజ్ఞ…ఎన్టీఆర్ బయోపిక్ సెట్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో మోక్షజ్ఞ ఈ సినిమాలో ఏదన్నా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడా అనే సందేహాలు నిజమనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో నట, రాజ‌కీయ జీవితం హైలెట్ చేస్తూ ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మోక్షజ్ఞ ..తన తాతగారి చిన్నప్పటి పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజముంది అనేది ఇప్పటివరకూ తెలియరాలేదు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ ను లొకేషన్ ను.. చూడడానికే మోక్షజ్ఞ సర్ ప్రైజ్ విజిట్ చేశాడని అంతకు మించి ఏమీ లేని టీమ్ మెంబర్స్ అంటున్నారు. కానీ ఈ సినిమాలో మోక్షజ్ఞ ఒక గెస్ట్ పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే షూటింగ్ లొకేషన్ కు వచ్చాడనే మీడియా అంటోంది. అయితే ఈ విషయమై అటు బాలయ్య గానీ ఇటు దర్శకుడు క్రిష్ గానీ అడిగితే కానీ క్లారిటీ రాదు. బాలయ్యని అడిగే ధైర్యం ఎవరూ చేయలేరు. క్రిష్ దొరికితే ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు .ఏమంటారు.