హిమదాస్ పై ప్రశంసల వర్షం…

ప్రపంచ అథ్లెటిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన హిమ దాస్‌.. ఓవరాల్‌గా ఈ టోర్నీలో స్వర్ణం అందుకున్న తొలి భారత మహిళగానూ రికార్డు సృష్టించింది.ఈ అరుదైన ఘనతను సాధించిన హిమదాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు హిమదాస్ ను అభినందించారు

మహేష్ బాబు

‘భారత క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజయాల్లో ఇది ఒకటి. హిమదాస్ అద్భుత ప్రతిభ కనబరిచింది.చాలా గర్వాంగ..సంతోషంగా ఉంది.కంగ్రాట్స్ హిమదాస్’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసి అభినందించారు.

ఎన్టీఆర్

‘చరిత్ర సృష్టించిన హిమదాస్ కు హృదయపూర్వక అభినందనలు..ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో స్వర్ణం నెగ్గిన అథ్లెట్‌గా నిలిచారు.ఇది గొప్ప సంతోషకరమైన సమయం’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

రామ్ చరణ్

‘హిమదాస్ కు సెల్యూట్ ..మీరు దేశాన్ని గర్వపడేలా చేసారు.ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు.దేశం యావత్తు మీకు సెల్యూట్ చేస్తోంది’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్ట్ చేసారు