‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్!?

రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్ చిత్రంలో హీరోయిన్ గా చేయాలనేది చాలా మంది కల. అయితే అది చాలా తక్కువ మందికే తీరుతుంది. ఎందుకంటే ఆయన సినిమాలు స్పీడు అంత తక్కువగా ఉంది. దాంతో ఇప్పుడు ఆయన చేయబోయే తాజా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌ ) చిత్రంలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకోబోతున్నారనే విషయమై ఇండస్ట్రీ అంతా దృష్టి పెడుతోంది. అయితే ఆ ఎన్నిక కాబోయే హీరోయిన్ సైతం బల్క్ గా డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయినా సరే రెడీ అంటున్నారు అమ్మాయిలు.

ఈ నేపధ్యం ఇప్పుడు ఈ చిత్రం లో ఏ హీరోయిన్స్ చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ మొదలైంది. అందుతున్న సమాచారం ఈ చిత్రం కీర్తి సురేష్ కు ఖచ్చితమైన స్దానం ఉండబోతోందని సమాచారం. ఈ మేరకు కీర్తి సురేష్ కొత్త చిత్రాలు ఏమీ ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. అందుకోసమే ఆమె మహానటి తర్వాత తెలుగులో ఏ సినిమా కమిట్ అవ్వలదేని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఏమీ ఫైనల్ కాలేదని..ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరిగాయని వినికిడి.

ఇక ఫస్ట్ షెడ్యూల్ నవంబర్ 29 నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే తీస్తారు. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ అవసరం లేదు. ఈ ఎపిసోడ్ షూట్ పూర్తయ్యాక…హీరోయిన్స్ ని ఫైనల్ చేసే అవకాసం ఉంది.

నిర్మాత మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయిలో చాటిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండడం ఓ కలలా ఉంది. మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడు కొనేలా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి అభిమానులు ఎన్నో అంచనాలతో ఆత్రుతగా ఎదురు చూస్తారని తెలుసు. అందుకు తగ్గట్లుగానే చిత్రం ఉంటుంది. ఈ నెల 19 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో హీరోల నేపథ్యంలో రెండు వారాల పాటు యాక్షన్ తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రంలోని ఇతర నటుల గురించి త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.పార్వతి.