లండన్ నుంచి సిడ్నీ కి ఐశ్వర్యారాయ్

లండన్ నుంచి సిడ్నీ కి ఐశ్వర్యారాయ్

ఆస్ట్రేలియా లో వున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్ అభిమానులకు శుభవార్త. ఇప్పటివరకు లండన్ మ్యూజియం లో వున్న ఐశ్వర్యారాయ్ మైనపు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరానికి మార్చుతున్నట్టు మేడం టుస్సాడ్స్ తన ఇంస్టాగ్రామ్ లో తెలిపారు . లండన్ నుంచి ఆమె విగ్రహాన్ని త్వరలో సిడ్నీ కి తరలిస్తున్నామని , ఐశ్వర్య అభిమానులందరికీ ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుందని , ఐశ్వర్యారాయ్ తో సెల్ఫీ లు తీసుకోవచ్చని మేడం టుస్సాడ్స్ పేర్కొన్నారు .

సిడ్నీ నగరంలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో బాలీవుడ్ తారల గ్యాలరీ లో ఐశ్వర్య మైనపు విగ్రహాన్ని ఉంచుతారు. ఇప్పటికే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడానికి తగిన స్థలం కేటాయించారు . షారుక్ ఖాన్ దగ్గరలో ఐశ్వర్య విగ్రహం ఉంటుంది . ఇది సందర్శకులకు ఎంతో సౌకర్యకరంగా ఉంటుంది .

భారతీయ తారల్లో ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు వున్న క్రేజ్ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు . బిడ్డలా తల్లి అయినా ఐశ్వర్య గ్లామర్ తగ్గలేదు . ఇక ఐశ్వర్య చాలాకాలం తరువాత దక్షిణాది సినిమాలో నటిస్తుంది . అదీ మణిరత్నం సినిమాలో . గతంలో మణిరత్నం సినిమాల్లో ఐశ్వర్య నటించింది . అయితే ఐశ్వర్య నటిస్తున్న ఈ చిత్రం చరిత్రాత్మకం కావడం విశేషం . కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ధ నవల ” పొన్నియిన్ సెల్వన్ ” . చోళ రాజు రెండవ రాజరాజ నరేంద్రుడు కథ ను మణిరత్నం చిత్రంగా రూపొందిస్తుయున్నాడు . ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ రాజరాజ నరేంద్రుని భార్యగా నటిస్తుంది .