ఐశ్వర్య తో ఆరాధ్య బచ్చన్ పిక్ చూశారా ?
సినిమా వినీలాకాశంలో విహరించే తారలు అంటే ఎందరికో అభిమానం , మరెందరికో ఆరాధన భావం . తెర వేల్పులను కొలిచే భక్తులు కూడా కోట్లల్లో వున్నారు . తారలు ఏది చేసినా సంచలనం. ఇక భార్య భర్తలు ఇద్దరు అగ్ర తారలైతే … వారి పిల్లల గురించి చిన్న చిన్న చిలిపి పనులు కూడా వార్తల్లో ప్రధానంగా చోటు చేసుకుంటున్నాయి . ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమాని .. ట్విట్టర్ లో తారలు పెట్టె పోస్టులు , ఫోతోలను లక్షల్లో చూస్తున్నారు .. లైకులు కొడుతున్నారు , ఆనందిస్తున్నారు .
హిందీ రంగంలో అమితాబ్ , జయ బచ్చన్ అంటే తెలియనివారు వుండరు . ఇద్దరు తారలే .. ప్రేమించి వివాహం చేసుకున్నారు . వారి కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఐశ్వర్యా రాయిని ఏరికోరి వివాహం చేసుకున్నాడు . తల్లి తండ్రి తారలు కావడం వారి కుమారుడు కోడలు కూడా అగ్ర తారలుగా ఉండటం అనేది అరుదైన విషయం. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యారాయ్ ముద్దుల కుమార్తె ఆరాధ్య . తల్లి ఐశ్వర్య తన కుమార్తెతో తీయించుకున్న తాజా పిక్ ను తన ట్విట్టర్లో ఉంచింది . అంటే ఈ పిక్ కు ఎంతో మంది ఫిదా అయిపోయారు . అభిషేక్ అయితే ” గుడ్ లక్ ఛార్మ్స్ ” అని కామెంటు పెట్టాడు . ఐశ్వర్య రాయ్ బచ్చన్ , ఆరాధ్య బచ్చన్ ఫోటో అదిరిపోయింది అనుకుంటున్నారు చూసిన అభిమానులు .