సిడ్ని వన్డేలో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు.  110 బంతుల్లో 4 సిక్స్ లు, 7 ఫోర్లతో రోహిత్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ కు తన కెరీర్ లో ఇది 22వ సెంచరీ. అతి తక్కువ కాలంలో 22 సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్ మన్ గా రోహిత్ రికార్డుల్లోకెక్కారు.  289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఒకనొక దశలో భారత్ గెలుస్తుందా అనే అనుమానాలు కలిగాయి. కానీ ధోని రోహిత్ శర్మ నిలకడగా ఆడి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ధోని 51 పరుగుల వద్ద అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 41 ఓవర్లలో 184/5. గా ఉంది. విజయానికి 105 పరుగుల దూరంలో భారత్ ఉంది.  

ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు(Ind-Aus) చేసింది వీళ్లే

సచిన్ టెండూల్కర్-9
రోహిత్ శర్మ-7
రికీ పాంటింగ్ -6
విరాట్ కోహ్లీ-5

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles