బ్రేకింగ్: ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మూడు రోజుల క్రితం చనిపోయారు. జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయారు. ఇంత‌లోనే ఇర్ఫాన్ కూడా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో బాలీవుడ్ పరిశ్ర‌మ సోక‌సంద్రంలోకి వెళ్లిపోయింది. ఇర్ఫాన్‌కు ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి.

ఇక ఆయ‌న విల‌క్ష‌ణ న‌ట‌న గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌న‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు. అన‌తి కాలంలోనే బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. తెలుగులోనూ ప‌లు సినిమాల్లో న‌టించారు. మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన సైనికుడు చిత్రంలో ప్ర‌ధాన విల‌న్ గా న‌టించి విమర్శ‌కుల ప్ర‌శంలందుకున్నారు. ప‌లు టెలివిజ‌న్ సీరియ‌ల్స్ లోనూ ఇర్ఫాన్ న‌టించారు. 1988 లో స‌లాం బాంబే సినిమాతో ఆయ‌న బాలీవుడ్ లో తెరంగేట్రం చేసారు.