కుక్క‌లతో పాడు అల‌వాటు ఏమిటో.. ఆ హాటీ నాటీ హీరోయిన్ ..  ప్చ్!

ఆ అందాల హీరోయిన్ ఆల్మోస్ట్ హీరోయిన్ గా ఫేడ‌వుట్ అయ్యింది. ఆ త‌ర్వాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో క‌లిసి సినిమాలు నిర్మిస్తూ న‌వ‌త‌రం ట్యాలెంటును ప్రోత్స‌హిస్తోంది. అయితే ఆరంభం సినిమా బిజినెస్ ఏమంత క‌లిసి రాలేదు. నిర్మాత‌గా వ‌రుస ఫ్లాపులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆల్మోస్ట్ ఖాళీయే అంటూ విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ అంత‌లోనే ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ ఫేట్ మార్చేసింది. ఆ త‌ర్వాత ఏకంగా పాన్ ఇండియా సినిమాకే లైనేశారు. ఇక ఇది వ‌ర్క‌వుటైతే నెక్ట్స్ పాన్ వ‌ర‌ల్డ్ రేంజే. ఇదంతా ఎవ‌రి గురించో చెప్పాల్సిన ప‌నే లేదు.

hotty naughty heroine love towards pet dogs
hotty naughty heroine love towards pet dogs

ఛార్మి- పూరి భాగ‌స్వామ్యం గురించే ఇదంతా. ఈ జోడీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ప్ర‌స్తుతం ఫైట‌ర్ అనే సినిమా కోసం చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ ని పెద్ద రేంజుకు తీసుకెళ్ల‌డ‌మే ధ్యేయంగా సీఈవోగా ప‌ని చేస్తున్న ఛార్మి నిరంత‌రం పావులు క‌దుపుతూనే ఉన్నారు. త‌మ భాగ‌స్వామ్యంపై ఎన్నో విమ‌ర్శ‌లు గాసిప్పులు వ‌చ్చినా వాటిని ఆ ఇద్ద‌రూ ఏనాడూ ప‌ట్టించుకోకుండా పాజిటివ్ ధృక్ప‌థంతో ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ‌తో పాన్ ఇండియా మూవీ ఫైట‌ర్ ని నిర్మిస్తున్నారు. దీనికోసం క‌ర‌ణ్ జోహార్ అంత‌టివాడినే బ‌రిలోకి లాగారు.

అదంతా స‌రే కానీ.. పూరి జ‌గ‌న్నాథ్ కేవ్ లో ఓ స్పెష‌ల్ బ్రీడ్ పెట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ పెట్ డాగ్ ఒడ్డు పొడుగు చూస్తుంటే మ‌హాకాయుడినే త‌ల‌పిస్తోంది. ఇక ఆ పెట్ డాగ్ తో ఆట‌లాడుతూ ఛార్మి ఎంత సంద‌డి చేస్తోందో క‌నిపిస్తోంది క‌దా!  జాక‌ల్ త‌ర‌హాలో క‌నిపిస్తున్నా.. ఇది చాలా స్పెష‌ల్ డాగ్ అని అర్థ‌మ‌వుతోంది. ఇక ఇంత భారీ కాయుడిని కౌగిలించుకున్న ఛార్మి విసిరిన స‌వాల్ చూశారుగా..

2020 ఏప్రిల్లోనే ఈ పెట్ డాగ్ ని ఛార్మి ప‌రిచ‌యం చేసింది. అప్ప‌ట్లో ఓ ఫోటోతో పాటు వీడియోని కూడా లాంచ్ చేసింది. ఈ డాగ్ ని ఫుల్ గా హ‌గ్ చేసుకుని ఛార్మి ఇచ్చిన ఆ ఫోజు సంచ‌ల‌న‌మైంది. ఇక ఇలాంటి డాగ్స్ పిట్ట‌లు చిలుక‌లు పూరి కేవ్ (డెన్ ) లో రెగ్యుల‌ర్ గా క‌నిపించేవే. వీటితో ఛార్మి బృందానికి బాగానే టైమ్ పాస్ అవుతోంది.