రాఘ‌వేంద్ర‌రావు కొడుకు విడాకుల‌పై ఇన్నాళ్ల‌కు లీకు

రాఘ‌వేంద్ర‌రావు కొడుకు విడాకులు

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి విడాకులు తీసుకున్నారు. ఇదీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్ మీడియాకి సెన్సేష‌న‌ల్ న్యూస్. ప్ర‌కాష్ కోవెల‌మూడి- క‌నిక థిల్లాన్ జంట విడిపోయారు. వీళ్లు క‌లిసి ప‌ని చేసేందుకే ఆస్కారం లేదు. అలాంటిది `జ‌డ్జిమెంటల్ హై క్యా` చిత్రానికి క‌నిక క‌థ‌ను అందించే వీలు కూడా లేదు!! అంటూ ముంబై మీడియా ఊద‌ర‌గొట్టేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎవ‌రు విడాకులు తీసుకున్నా దానిని ముందుగా టీఆర్పీ గేమ్ ఆడే ముంబై మీడియాకి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ దొరికింద‌నే చెప్పాలి. అందుకే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ దీనిపై ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. 

స‌ద‌రు ముంబై మీడియా ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి చేత‌నే విడాకుల మ్యాట‌ర్ ని చెప్పిండం మ‌రింత ఇంట్రెస్టింగ్. ఎలానూ మీడియా అయిన‌దానికి కానిదానికి హ‌డావుడి చేసేస్తుంది కాబ‌ట్టి నాకెందుకులే అని మొత్తానికి ప్ర‌కాష్ కోవెల‌మూడి సైతం ఈ విష‌యాన్ని మీడియా ముందే ఓపెన్ అయిపోయాడు. “రెండేళ్ల క్రిత‌మే మా దారులు వేర‌య్యాయి. విడాకుల‌తో విడిపోయామ‌ని“ ఆయ‌న‌ వెల్ల‌డించారు. విడిపోయినా క‌లిసే ప‌ని చేస్తామ‌ని క‌నిక థిల్లాన్ సైతం అన‌డం కొస‌మెరుపు. “మేం హైదరాబాద్‌లో సెటిలయ్యాం.. నా స్నేహితులు బంధు మిత్రులు అంతా అక్క‌డే ఉన్నారు. కానీ ఆమె రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్ అయ్యారు“ అని ప్రకాష్ మీడియాకి వెల్లడించారు. “మేం ఎందుకు విడిపోయాం అనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నాం. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఈ నిర్ణయం“ అని కనికా అన్నారు.

ప్ర‌కాష్ కోవెల‌మూడి తెర‌కెక్కించిన చాలా సినిమాల‌కు క‌నిక థిల్లాన్ స్క్రిప్ట్ రైట‌ర్. అనుష్క క‌థానాయిక‌గా తెర‌కెక్కించిన `సైజ్ జీరో` చిత్రానికి ఆయ‌న భార్య క‌నిక క‌థ‌ను అందించారు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కంగ‌న – రాజ్ కుమార్ రావ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన `జ‌డ్జిమెంట‌ల్ హై క్యా` చిత్రానికి ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, క‌నిక థిల్లాన్ స్క్రిప్టును అందించారు. ఈ జంట విడిపోయిన ప్ర‌చారం ఇప్పుడే ఎందుకో కానీ… మొత్తానికి బాలీవుడ్ మీడియా ఈ విడాకుల వార్త‌ల‌తో పండ‌గ చేసుకుంటోంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే కొన్ని మీడియాలు ఏకంగా హైద‌రాబాదీ బ్యూటీ దియా మీర్జా- సాహిల్ సంఘా విడాకుల‌కు.. ప్ర‌కాష్ కోవెల‌మూడి- క‌నిక థిల్లాన్ విడాకుల‌కు లింకు పెట్టి రాయడం మ‌రీ విడ్డూరం. వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ర‌చ్చ‌కీడ్చి టీఆర్పీ గేమ్ ఆడుకోవ‌డంలో ముంబై మీడియాకి ఉన్న కుతి ఇంకెక్క‌డా ఉండ‌దు. మ‌రి ఆ సంస్కృతికి బ‌య‌ప‌డే ఇలా చాలామంది ఓపెన్ అవుతున్నార‌ని భావించాలేమో!!