Niharika Divorce: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా హీరోయిన్ గా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలకు నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. నిహారిక సినీ కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే… ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే జొన్నల గడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది .ఈమె వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ కోటలో కన్నుల పండుగగా మూడు రోజుల పాటు జరిగింది.
ఇలా ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నిహారిక రెండు సంవత్సరాలు కూడా పూర్తికాకుండానే తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు అయితే ఈ విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే విడాకుల గురించి గతంలో నిహారిక ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ విడాకులు తీసుకోవాలని ఎవరు కూడా పెళ్లి చేసుకోరు అది ఉదయపూర్ పెళ్లి అయిన ఇంట్లో పెళ్లి అయినా. అందరూ అనుకున్నట్టు నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేదని నేను పెద్దలు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. అయితే మా ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగానే విడిపోయామని తెలిపారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు ఆ నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది కానీ మీకు కాదు అంటూ కాస్త ఘాటుగా ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో కేటీఆర్ పై దృష్టి సారిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇటీవల కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా సక్సెస్ కొట్టిన నిహారిక ప్రస్తుతం సంతోష్ శోభన్ తో మరో సినిమా చేస్తున్నారు.
