‎Hansika Motwani: విడాకుల రూమర్స్‌.. పెళ్లి ఫోటోస్ డిలీట్‌ చేసి షాకిచ్చిన హీరోయిన్!

‎Hansika Motwani: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. తెలుగుతోపాటు ఇంకా కొన్ని భాషల్లో కూడా నటించి నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఢీ వంటి డాన్స్ షో లకు జెడ్జ్ గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

‎ అదేమిటంటే.. హన్సిక ఆమె భర్త సోహైల్ విడాకులు తీసుకోబోతున్నారు త్వరలోనే విడిపోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఈ మధ్య కాలంలో హన్సిక ఆమె భర్త ప్రవర్తన చూస్తే ఆ వార్తలు నిజమని నమ్మక తప్పదు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆమె భర్త సోహైల్‌ స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. అయినప్పటికీ రూమర్స్‌ మాత్రం తగ్గలేదు. ఇలాంటి సమయంలో హన్సిక తమ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది.

‎ దీంతో వారి విడాకుల అంశం నిజమనేలా సంకేతాన్ని ఇచ్చింది. 2022లో సోహైల్‌తో హన్సిక వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే, కొద్దిరోజులుగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సోహల్‌ ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలను తొలగించేసింది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హన్సిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.