మాజీ కాస్తా ఇప్పుడు క్రేజీ గర్ల్ ఫ్రెండ్ అయ్యిందా…ఏది నిజం?

(సూర్యం)

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కు మధ్య ప్రత్యేకమైన రిలేషన్ ఉందన్న సంగతి తెలిసిందే. కొందరేమో అది వృత్తిపరమైన స్నేహం..ఒకప్పుడంటే లవర్స్ గా ఉండేవారు కానీ ఇప్పుడేమీ లేదు అంటారు. మరికొందరు అబ్బే..మళ్లీ వాళ్లిద్దరూ కలిసిపోయారు అని కామెంట్స్ చేస్తూంటారు. అయితే అసలు నిజం ఏమిటనేది వీళ్లద్దరికీ తప్ప మరొకరి తెలియదు. అయితే కత్రినా కైఫ్ అఫీషియల్ గా మాత్రం ఈ మధ్యకాలంలో సల్మాన్ తో పెద్దగా రాసుకుపూసుకు తిరగటం లేదు. ఆమె ప్రపంచంలో ఆమె ఉండిపోతోంది.

అయితే తాజాగా ఆమె వినాయిక చవితి పేరు చెప్పి సల్మాన్ ఇంటికి వచ్చి అక్కడ గేణేసుడుకి హారతి ఇచ్చి సల్మాన్ కు ఆనందం కలిగించింది. సల్మాన్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకలో కత్రినా ఓ రాజకుమారిలా వెలిగిపోయింది. ఆ స్దాయిలో అక్కడ ఆమెకు ట్రీట్ ఇచ్చారట. సల్మాన్ సోదరుడు, వాళ్ల పిల్లలు, సల్మాన్ సోదరి అర్పితాఖాన్ ఆమె భర్త,పిల్లలు పాల్లొన్న ఈ వినాయక చవితి హారతి మహోత్సవం పేరు చెప్పి మాజీ ప్రియులు ఇద్దరూ ఒకటయ్యారు అని బాలీవుడ్ భారీ ఎత్తున కోడై కూస్తోంది.

అయితే కేవలం ఆ కుటుంబం ఆహ్వానించారు. కర్టిసీ కోసం వెళ్లొచ్చింది అని కత్రినాకైఫ్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఎవరి మనస్సులో ఏముందో కానీ ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియచేసింది మాత్రం అతుల్ అగ్నిహోత్రి ఆయన ట్విట్టర్ లో ఇదిగో ఈ వీడియో రూపంలో వెల్లడి చేసారు.