ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్ద హీరోలు సందడి చేయడం అనేది సదా మామూలే. అయితే ఈ సారి బరిలోకి మహేష్‌బాబు, బన్నీ ఇద్దరూ వస్తున్నారు. వీళ్ళు ప్రమోషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒకరి పై ఒకరు పోటీ పడుతూనే వచ్చారు. వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో విడుదల చేస్తే వెంటనే మరొకరు స్పందించి వాళ్ళ సినిమా అప్‌డేట్ ఇస్తూ ఒకరి పై ఒకరు పోటీ పడుతూ వచ్చారు ఇప్పటివరకు. అయితే
పెద్ద సినిమాకు, అందులోనూ సంక్రాంతికి ఫుల్ కాంపిటీషన్ మధ్య విడుదల కాబోతున్న సినిమాకు దేవి తేలిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అటు అలవైకుంఠపురంతో పోల్చుకుంటే సరిలేరు ఆడియో పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. ఐటమ్ సాంగ్ అయినా ఆకట్టుకుంటుంది అని ఆఖరి వరకు వెయిట్ చేసినా అదీ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో దేవి పై మహేష్ సహా దర్శక నిర్మాతలు కాస్త కోపంగానే ఉన్నారని తెలుస్తోంది. అటు బన్నీ సినిమా సాంగ్స్ దూసుకుపోతున్నాయి.. ఆడియో వరకు సరిలేరు ఫ్లాప్ అనే చెప్పాలి. సరిలేరు పాటలకు కూడా చాలా వ్యూకౌంట్ తక్కువొచ్చిందనే చెప్పాలి. కానీ బన్నీ అలవైకుంఠపురంలో మాత్రం ఒక్కో పాట ఒక్కో బీట్‌తో అదరగొట్టేశాడు తమన్.
ఈ మధ్య కాలంలో తమన్ సంగీతం అందించిన సినిమాలన్నీ పాటల పరంగానే కాకుండా సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. ఇటీవలె విడుదల అయిన ప్రతిరోజూ పండగే చిత్రం కూడా అటు పాటలే కాక సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఏ సినిమాకైనా కథ కాస్త అటూ ఇటూ అయినా పాటలు బావుంటే పాటల కోసమన్నా సినిమా చూస్తారు. చాలా మంది సంగీత ప్రియులు సినిమా ఏముందిలే పాటలు బావున్నాయి కదా అని సినిమాకి వెళ్ళిన సందర్భాలెన్నో అలాంటిది మరి సరిలేరు నీకెవ్వరు మాత్రం దేవిశ్రీ ఎందుకో నీరుకార్చేశాడనే చెప్పాలి. పైకి చెప్పుకోడానికి మైండ్‌బ్లాక్, హీ సో క్యూట్ అంటున్నారు కానీ… పెద్దగా హిట్ అయితే మాత్రం కాలేదు. దేవిశ్రీ ఏదో కాస్త ఎక్కువ అరుపులతో హడావిడి చేస్తున్నాడు కానీ పాటలో మాత్రం ఆ ఊపు లేదు. అలాగే ఏ సినిమాకైనా సరే పాటలు హిట్ అయితే చాలు సగం సినిమా హిట్ అయిపోయినట్లే.