సుధీర్ హంట్ కలెక్షన్స్… ఇలా అయితే ఎలా బాసూ?

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియుల్ని మెప్పించే ప్రయత్నం చేసే హీరో సుధీర్‌బాబు. కానీ, కొన్నాళ్లుగా ఆయన కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకోలేకపోతున్నారు. సరైన సక్సెస్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యాక్షన్‌ కథను ఎంచుకొని ‘హంట్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారాయన. మహేశ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు సరికొత్త యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆసక్తికరంగా ఉండటంతో సుధీర్కు ఈ సారి ఎలాగైనా హిట్ కొడతారని ఫ్యాన్స్ ఆశించారు. అలా ఈ చిత్రం జనవరి 26న విడుదలైంది. దాదాపు దాదాపు 300కు పైగా స్క్రీన్లలో రిలీజైనట్లు తెలుస్తోంది. అయితే తొలి కలెక్షన్ వివరాల ప్రకారం.. ఇప్పుడీ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయిందనే అనిపిస్తోంది.

అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ వివరాల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఓ వైబ్సైట్ కథనం ప్రకారం.. ఓవర్సీస్ ప్రీమియర్స్తో 5 వేలలోపు డాలర్స్నే అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 18-20 లక్షల రేంజ్లోనే షేర్ను అందుకున్నట్లు తెలుస్తుంది. అది కూడా డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా వచ్చిన కలెక్షన్స్ లెక్క ఇది అని ఉంది.

అయితే మరో కథనం ప్రకారం మొత్తంగా దాదాపు రూ.5 నుంచి రూ.10కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు రూ.1.50 నుంచి రూ.2కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అందులో రాసి ఉంది. మరి ఇందులో ఏది నిజమంతో తెలియదు గానీ కలెక్షన్స్ వివరాలు క్లారిటీగా తెలియాలంటే అధికార ప్రకటన రావాల్సిందే. ఏదేమైనప్పటికీ ఈ సారి కూడా సుధీర్ బాబుకి తీవ్రమైన నిరాశ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ ఖాయమని చెప్పాలి.

ఇకపోతే ఈ చిత్రంలో కబీర్‌ సింగ్, చిత్రా శుక్ల, మైమ్‌ గోపీ, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, రవి వర్మ తదితరులు కూడా నటించారు. రేనాడ్‌, బ్రయాన్‌ విజియర్ యాక్షన్‌ కొరియోగ్రాఫీ చేశారు. జిబ్రాన్‌ సంగీతం అందించారు. అరుళ్‌ విన్సెంట్‌.. ఛాయాగ్రహణం అందించారు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరించారు.