మొత్తానికి అనుష్క అప్డేట్ వచ్చేసింది

జాతిరత్నాలు సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత మహేష్ బాబు వన్ మూవీలో కూడా నటించాడు. అయితే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా హిట్ కొట్టాడు.

ఇక జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. రారా క్రిష్నయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా చేయడం ఆసక్తికరంగా మారింది. కుర్ర హీరో, స్టార్ హీరోయిన్ కాంబినేషన్ లో సినిమా అనేసరికి దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని ఓ యువతికి, 25 ఏళ్ళ కుర్రాడికి మధ్య నడిచే లవ్ స్టొరీగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి మిస్టర్ అండ్ మిస్ శెట్టి అనే టైటిల్ ని ఖరారు చేసారని టాక్ వినిపించిన అధికారికంగా అయితే ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా నవీన్ పోలిశెట్టి ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశాడు.

రేపు ఈ సినిమాకి సంబందించి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేయబోతున్నట్లు తెలిపాడు. నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో ఫన్ మోడ్ లో వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ఇవ్వడం విశేషం. ఇక అనుష్క కూడా చాలా రోజుల నుంచి మీడియా ముందుకి రాలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమాతో అయిన అనుష్క మరల కెమెరా లైట్స్ లోకి వస్తుందేమో అనేది చూడాలి.