రెండు సంప్రదాయాలతో దీపికా రణ్వీర్  పెళ్లి

చాలాకాలంగా ఎదురుచూస్తున్న దీపికా రణ్వీర్ ల వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో  జరుగుతుందని  ఈ నెల 21 న ప్రకటించారు . ఇక అప్పటి నుంచి ఊహాగానాలు వెలువడుతున్నాయి . పెళ్లి ఎక్కడ జరుగుతుంది . రెండు రోజులు పెళ్లేమిటి ? ఇలా అభిమానులు, ప్రేక్షకుల  సందేహాలకు దీపిక , రణ్వీర్ తెర దించారు దుబాయిలో జరిగే వివాహానికి దీపిక , రణ్వీర్ లకు అత్యంత దగ్గర స్నేహితులు , కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారట . ఈ వివాహానికి కావలసిన అన్ని ఏర్పాట్లు వీరికి సన్నిహితుడైన సంజయ్ లీల భన్సాలీ దగ్గరుండి చేయిస్తున్నాడట .
ఇక నవంబర్ 14 న కన్నడ సంప్రదాయం ప్రకారం వీరి ఇద్దరి వివాహం జరుగుతుంది . దీపికా తల్లి  ఉజ్జల, తండ్రి ప్రకాష్ పాడుకొనే దగ్గరుండి ఈ విహాయాన్ని తమ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా  నిర్వహిస్తారు .

15వ తేదీన  రణ్వీర్ సింగ్ తల్లి అంజు తండ్రి జగత్ జిత్ సింగ్  తమ సింధీ  సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్త్తారు .  రెండు వారాలు దీపిక, రణ్వీర్
 హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకొని భారత దేశం తిరిగి వస్తారు . డిసెంబర్ 1న ముంబైలో వివాహ విందు ఏర్పాటు చేస్తారని వారి సన్నిహితులు తెలిపారు .