వాడిని క్రికెటర్‌ని చేస్తా: కరీనా

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ కుమారుడు పుట్టుకతోనే స్టార్ అయిపోయాడు. క్యూట్ బేబీగా తైమూర్ అలీఖాన్ దేశవ్యాప్తంగా చాలా గుర్తింపును పొందాడు. తైమూర్ బయట కనబడితే చాలు.. ఫొటోగ్రాఫర్లకు చేతి నిండా పనే. ఈ బాలుడికి పెట్టిన తైమూర్ అనే పేరు కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

భారత్‌పై దండెత్తిన ఒక ముస్లింరాజు పేరు కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సైఫ్, కరీనా జంట ఆ పేరు విషయంలో వెనక్కి తగ్గలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా తన కుమారుడి భవిష్యత్తు గురించి మాట్లాడింది. తన కుమారుడిని పెద్ద క్రికెటర్‌ని చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. తైమూర్ తాత అయిన టైగర్ పటౌడీ గతంలో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అందుకే తాత బాటలో తైమూర్‌ను కూడా క్రికెటర్‌ను చేయాలనుకుంటున్నట్టు కరీనా చెప్పింది.