Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి బాలీవుడ్‌తో పాటు అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. జనవరి 16న బాంద్రాలోని తన నివాసంలో అనుకోని ఘటన ఎదుర్కొన్న సైఫ్, కుటుంబ సభ్యుల సహాయంతో ఆసుపత్రికి తరలించబడ్డారు. దొంగతనానికి వచ్చిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
తాజాగా, ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన సైఫ్, తనకు ఆ రోజు జరిగిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దాడి సమయంలో కుర్తా పూర్తిగా రక్తంతో తడిసిపోయిందని, తనను ఆసుపత్రికి తరలించేందుకు కరీనా ఆటో లేదా క్యాబ్ కోసం ప్రయత్నించిందని చెప్పారు. అయితే, ఆ సమయంలో తన కుమారుడు తైమూర్ తన దగ్గరికి వచ్చి, “నాన్న, నువ్వు చనిపోతున్నావా?” అని ప్రశ్నించడంతో ఎంతో క్షణికమైన భయాన్ని అనుభవించానని వెల్లడించారు.
సైఫ్ తన కొడుకుకు “ఏమీలేదు, నేను బాగుంటా” అని చెప్పినా, తైమూర్ ఆసుపత్రికి తనతో పాటు రావడం తనకు మానసికంగా ధైర్యం కలిగించిందని అన్నారు. తన కుమారుడు పక్కన ఉన్నప్పుడు ఒంటరి అనిపించలేదని, ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు. దాడి తరువాత తాను కోలుకుంటున్నానని, కుటుంబ సభ్యుల మద్దతు వల్ల శక్తిగా ఉన్నానని తెలిపసమయం. ఈ ఘటన బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.