కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్న నటి కరీనాకపూర్. ప్రముఖ స్టార్స్ అందరితోనే స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ నటి స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకుంది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్న కరీనా ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇద్దరు బిడ్డల తల్లి అయినప్పటికీ ఏమాత్రం తీసిపోని అందంతో కుర్ర హీరోయిన్లకి గట్టి పోటీని ఇస్తుంది. సింగం అగైన్, బకింగ్ హామ్ ప్యాలెస్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తూ బిజీగా ఉన్న ఈ నటి ఇటీవల నటించిన క్రూ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఆమెతో నటించాలని ఎందరో నటులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఒక పాకిస్తానీ నటుడు చేసిన ప్రకటన మాత్రం ఇప్పుడు కరీనా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్నాయి. కఖాన్ షవనాజ్ పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ నటుడు 27 సంవత్సరాల ఈ క్రేజీ యాక్టర్ చాలా సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించాడు.
అలాగే కొన్ని రియాల్టీ షోస్ లో కూడా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో కూడా ఇతనికి భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే అతను ఈ మధ్య ఒక పాకిస్తాన్ షోలో పాల్గొన్నారు. అక్కడ ఒక అభిమాని మీరు కరీనాకపూర్ తో ఏదో ఒక రోజు స్క్రీన్ ని పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. అలాంటి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. ఆమె వయసులో నాకన్నా చాలా పెద్దది కాబట్టి నేను ఆమెకి కుమారుడుగా మాత్రమే నటించగలను అని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఏజ్ షేవింగ్ చేస్తున్నాడు అంటూ అతనిపై విరుచుకుపడుతున్నారు కరీనాకపూర్ ఫ్యాన్స్. పాకిస్తానీ నటులు భారత్ లో సినిమాలు చేయటానికి వీలు లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నువ్వు ఆమెతో కనీసం స్టేజ్ కూడా పంచుకోలేవు అలాంటిది స్క్రీన్ ఎలా షేర్ చేసుకుంటావు, తనతో నటించే ఛాన్స్ నీకు ఎవరు ఇస్తారు అంటూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.