“బంగారి బాలరాజు”.విజయవంతం కావాలి  కె. వి.రమణాచారి

పరువు హత్యల నేపథ్యం లో వస్తున్న రాయలసీమ ఫ్యాక్షన్ ప్రేమకథ “బంగారి బాలరాజు”.  చిత్రాన్ని తప్పకుండా చూస్తానని తెలంగాణ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి  చెప్పారు .

ఈరోజు  బంగారి బాలరాజు చిత్రం విడుదల సందర్భంగా  కె.వి.రమణాచారి గారిని చిత్ర యూనిట్ సభ్యులు ఆయన నివాసంలో కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణాచారి  మాట్లాడుతూ….”బంగారి బాలరాజు”  చిత్రం సామిజిక ఇతివృత్తంతో నిర్మించిందని అందుకే విజయవంతం కావాలని కోరుకుంటున్నానని  చెప్పారు .

గతంలో “అనిత ఓ అనిత” వీడియో పాటని చూశానని, సోషల్ మీడియా అంతగా అందుబాటు లేని రోజుల్లోనే కోటేoద్ర దుద్యాల తన అనిత ఓ అనిత వీడియో సాంగ్ ని సంచలనం చేశారని రమణాచారి ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఈ బంగారి బాలరాజు సినిమా కూడా  హిట్టయి దర్శకుడుపై మంచి గుర్తింపు రావాలని  అన్నారు. హీరోయిన్ కరోణ్య కత్రిన్ ని మూడు సంవత్సరాల క్రితం తిరుపతిలో చూసి మంచి భవిష్యత్తు ఉందని  ఆరోజు దీవించడం ఆ అమ్మాయి హీరోయిన్ కావడం ఆనందంగా ఉందని చెప్పారు .