అనసూయా…ఈ ఫొటో చూస్తే కుర్రాళ్లు ఆగలేరుగా

                                                                               (సూర్యం)

అనసూయ హఠాత్తుగా సెంటరాఫ్ ది ఎట్రాక్షన్ అయిపోయింది. ఆమె వదిలిన ఒక్క ఫొటో క్రేజ్ కు కిక్ ఇచ్చింది. షార్ట్స్ లో ఆమె తన సోయగాలను పరిచిన తీరు కుర్రకారుకి మంత్రం వేసినట్లుంది. దాంతో వాళ్లంతా ఇలాంటి ఫొటోలు..ఇంకా..ఇంకా కావాలే అని కలవరించిపోతున్నారు.

రీసెంట్ గా దసరా సెలవులకు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన అనసూయ…క్యాజువల్ గా దిగినట్లుగా ఓ ఫొటో దిగింది. అయితే ఆ ఫోటో కార్చిచ్చు మాదిరిగా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఈ ఫొటోకు ఆమె సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగానే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. జనం ఎగబడి మరీ కామెంట్స్ చేస్తున్నారు. 

కేవలం ఇలా ఫోటోల్లోనే కాకుండా అప్పుడప్పుడూ కాస్త సినిమాల్లో కూడా మీరు ఇలా గ్లామర్ ప్రదర్శన చేయచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నారు.  అయితే ఎప్పుడూ నెగిటివ్ పక్షలు ఉంటాయి కదా. ప్రతీది నెగిటివ్ యాంగిల్ లో చూస్తూ కామెంట్స్ చేస్తూంటారు. అలాంటివారే ఆమెకు తగిలారు.

ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ ఆంటీ నీకు ఈ ఎక్స్ పోజింగ్ అవసరమా ? అంటూ అల్లరి చేయటం మొదలెట్టారు. ఏదైతేనేం అనసూయ మళ్లీ పూర్తి బిజీ అవుతోంది. సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. రంగమ్మత్తగా ఆమె చేసిన హంగామా మర్చిపోగలమా చెప్పండి.