బన్ని ని అడ్డం పెట్టి ఇక్కడ పాగా వేసేద్దామనే…

                                                                      (సూర్యం)

అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్ సరసన నటించే ఛాన్స్ పట్టడం అంటే మాటలు కాదు. అందుకోసం రకరకాల ఫీట్స్ చేస్తూంటారు. ఆ హీరోల దృష్టిలో పడాలని స్టేట్మెంట్స్ ఇస్తూంటారు. ఇదిగో ఇప్పుడు పరుల్ గులాటి అలాంటి పోగ్రామే పెట్టుకుంది. ఈ ముంబై మోడల్ రీసెంట్ గా అల్లు అర్జున్ తో కలిసి రెడ్ బస్ వారి యాడ్ లో నటించే ఛాన్స్ సాధించింది. ఆ షూటింగ్ పూర్తైన తర్వాత ఎలాగైనా బన్ని సరసన హీరోయిన్ ఛాన్స్ సాధించిందాలనుకుందో ఏమో కానీ…ఆయన్ని పొగుడుతూ  లీడింగ్ డైలీతో మాట్లాడింది. అది ఆమె పీఆర్వో  ఎరేంజ్ చేసిన కవరేజ్ పోగ్రాం.

ఆ సందర్బంగా అల్లు అర్జున్ తో తీసుకున్న ఒక సెల్ఫీని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ముంబై ముద్దుగుమ్మ బన్నీపై ప్రశంసల జల్లు కురిపించింది. ముఖ్యంగా స్టైలిష్ స్టార్  డాన్స్ గురించి పరుల్ గులాటి ప్రత్యేకంగా మాట్లాడింది.

నిజానికి ఆ యాడ్ లో అల్లు అర్జున్ తో డాన్స్ చేసే అవకాశం ఈమెకు దక్కలేదు. అయినా కూడా బన్నీ డాన్స్ గురించి మాట్లాడటం ద్వారా ఈమె మనస్సులో వేరే  ఆలోచన ఉందని అర్దమవుతోంది. ఇలా అల్లు అర్జున్ గురించి మాట్లాడటంతో ఇదిగో ఇలా మనమంతా ఆమె గురించి మాట్లాడటం మొదలెడతాం. దాంతో బన్ని తో కాకున్నా టాలీవుడ్ లో ఎంట్రీ  దొరికే అవకాసం ఉంది.

ఇలాంటి బిల్డప్ లు ఇవ్వటంలో  బాలీవుడ్ హీరోయిన్స్ పండిపోయారు. ఇలా మాట్లాడి..ఆ తర్వాత మెల్లిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూంటారు. అయినా మనవాళ్ళకు ఎలాగో ఇక్కడి తెలుగు అమ్మాయిలు నచ్చరు. ముంబై అమ్మాయిలు మీదే దృష్టి. ఆమె పంజాబి అయితే మరీ మేలు. కాబట్టి పరుల్ కూడా త్వరలో ఇక్కడ లాంచ్ అయ్యే పోగ్రాం పెట్టుకుందన్నమాట.