టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు వచ్చినా కూడా ఈ నలుగురు సీనియర్ హీరోల హవా మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళకు ఎక్కడా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎంత యంగ్ హీరోలు వచ్చినా కూడా వాళ్ళ దారి వాళ్ళదే వీళ్ళ దారి వీళ్ళదే అన్నట్లు హిట్లు కొడుతున్నారు. ముందుగా చిరంజీవి విషయానికి వస్తే సైరా నర్సింహారెడ్డి చిత్రం విషయానికి వస్తే స్వతంత్రపోరాట యోధుడు ఉయ్యాలవాడ నర్సిహారెడ్డి చిత్రంలో నటించి మంచి విజయం సాధించారు. ఇక ఈ చిత్రం కథ పరంగా హిట్ అయినా కూడా కలెక్షన్లు పరంగా పెద్దగా రాబట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్ర నిర్మాత రాంచరణ్ కాస్త నష్టపోయినట్లే. అలాగే ఇందులో చిరంజీవి, జగపతిబాబు పాత్రలకు మంచి పేరు వచ్చింది. సినిమా మొత్తం మిక్స్‌డ్ టాక్‌లో నడిచింది. అంటే ఎక్కువగా క్లాస్ ప్రేక్షకులు దీన్ని ఆదరించారు కాని మాస్ ఆడియన్స్‌లోకి సినిమా పెద్దగా వెళ్లలేకపోయిందనే చెప్పాలి. ఈ చిత్రం ఒకేసారి అన్ని భాషల్లో విడుదలైన తెలుగులో మాత్రమే హిట్ అనిపించుకుంది. మిగిలిన అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్‌నే మిగిల్చింది.
బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయిందనే చెప్పాలి. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తన తండ్రి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు ఘోర పరాజయాలయ్యాయన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన రూలర్‌తో కె.ఎస్. రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే బోయపాటి కాంబినేషన్‌లో మరో చిత్రం ఈ మధ్యనే ప్రారంభమయింది. మరి ఈ రెండు చిత్రాలతో బాలయ్య ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాలయ్యకు హిట్టు లేదనే చెప్పాలి. మరి ఈ రెండు చిత్రాలైనా కనీసం బాలయ్యకు ఊరటనిస్తాయో లేదో. రాజకీయంగా మాత్రం హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.. పార్టీ ఓడినా బాలయ్య గెలవడం అనేది మాత్రం ఆయనకు కాస్త ఊరట కలిగించిందనే చెప్పాలి.
ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఎఫ్2 సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ఇటీవలె తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన వెంకీమామ చిత్రం మిక్సడ్ టాక్ వచ్చినా వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సంవత్సరంలో ఆయన ఇద్దరు హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేయడం ప్రశంసనీయం అనే చెప్పాలి. ఇకపోతే దాదాపు పెద్ద హీరోలు ఎవ్వరూ కూడా మల్టీ స్టారర్ చెయ్యడానికి పెద్దగా ఇష్టపడరు కానీ వెంకటేష్ అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. అలా మల్టీస్టారర్‌లో చేసి కూడా హిట్ కొట్టడం అలాగే తన పాత్రకు మంచి గుర్తింపు రావడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక ఈ సంవత్సరం నాగార్జునకి చేదు అనుభవం అనే చప్పాలి. ఆయన నటించిన మన్మథుడు 2 చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఆయన ఈ ఏజ్ లో మరీ అంత రొమాంటిక్ చిత్రం చేయడం సినిమాలో అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవడంతో ఒకరకంగా చప్పాలంటే ఆ సినిమాతో నాగ్ పరువంతా పోయిందనే చెప్పాలి. బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేశారు కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు. ప్రస్తుతం హిందీలో బ్రహ్మాస్త్ర మూవీతో బిజీగా ఉన్నారు.