రాజ‌శేఖ‌ర్ కూడా త‌గ్గ‌డం లేదుగా..!

`పి.ఎస్‌.వి.గ‌రుడవేగ` చిత్రంతో స‌క్సెస్ కొట్టిన రాజ‌శేఖ‌ర్ ప్లానింగ్‌తో సినిమాల‌ను ఎంపిక చేసుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం `అ!` ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో `క‌ల్కి` అనే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ తెలంగాణ యాస‌లో మాట్లాడే పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడు. అందుకోసం ప‌టాన్ చెరువులో రెండు కోట్ల రూపాయ‌ల‌తో ఓ సెట్ వేశార‌ట‌. మేకింగ్ విష‌యంలో రాజ‌శేఖ‌ర్ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఈ నెల 19 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సి.క‌ల్యాణ్‌, స‌హా రాజ‌శేఖ‌ర్ కుమార్తెలు శివాని, శివాత్మిక‌లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.