సమంత వల్ల గట్టెక్కిన నందినీ రెడ్డి

పరిశ్రమలో ఉన్న కొద్ది మంది మహిళా దర్శకుల్లో నందినీ రెడ్డి ఒకరు. మొదటి సినిమా ‘అలా మొదలైంది’ హిట్ అయినా ఆ విజయాన్ని అటు పైన కొనసాగించలేకపోయింది. అయితే మళ్ళీ సమంతతో చేసిన తాజా చిత్రం ‘ఓహ్ బేబీ’ చిత్రానికి మంచి ఆదరణ వస్తుండడంతో ఆమె కెరీర్ మళ్ళీ గాడిలో పడ్డట్టే.

ప్రస్తుతం ఈమె తదుపరి సినిమా ఒక పెద్ద బ్యానర్లో ఉందట. అది కూడా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఒక పెద్ద స్టార్ హీరోని డైరెక్ట్ చేయనుందట. ఈ సినిమా ఒక రొమాంటిక్ ప్రేమ కథా చిత్రమనీ ఆ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పింది.