Rashmika: రష్మిక మందన్న ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె ఇటీవల వరుసగా యానిమల్, పుష్ప 2, చావా, సికిందర్ వంటి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కుబేర అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా నిత్యం వరుస షూటింగ్ పనులలో బిజీగా ఉంటూ వరుస సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నారు.
ఇకపోతే తాజాగా రష్మికకు సంబంధించిన మరో కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా ఈమె కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు అయితే ఈ పోస్టర్లో రష్మిక మాత్రం చాలా భయంకరంగా అందరిని భయపెట్టే విధంగా ఉందని చెప్పాలి. రష్మిక మందన్న ఇప్పుడు నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ టైటిల్ “మైసా”. రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఐదు భాషలలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్ట్ లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించారనే చెప్పాలి.
ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. “ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి.. !” అంటూ నిర్మాణ సంస్థ షేర్ చేసిన పోస్టర్ పై క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఇందులో రష్మిక వారియర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ పై రష్మిక కూడా స్పందిస్తూ..నేనెప్పుడూ కొత్తది.. భిన్నమైనది.. ఉత్తేజకరమైన పాత్రలకు ప్రాధాన్యమిస్తాను. మైసా లాంటి ఒకటి. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది. ఇప్పటివరకు చేయని వెర్షన్. ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే అంటూ చెప్పుకో వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తుంది.