వరుస మరణాలతో బాలీవుడ్ బెంబేలెత్తిపోతుంది. నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తర్వాత మరో ఇద్దరు సెలబ్రిటీలు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అటు సెలబ్రిటీ కుటుంబాల్ని కరోనా సోకడంతో పరిస్థితి ఇంకా టెన్షన్ గా మారింది. తాజాగా మరోనటి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. అయితే ఆమె బాలీవుడ్ నటి కాదు..హాలీవుడ్ నటి. ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా తన కుమారిడితో కలిసి ఓ బోటును కాలిఫోర్నియాలోని పెరూ నదిలో అద్దెకు తీసుకుని వెళ్లింది. అయితే సాయంత్రం అయినా రివీరా రాకపోవడంతో బోటు యజమానికి అనుమానం వచ్చింది.
దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపాడు. దీనిలో భాగంగా రంగంలోకి దిగిన సిబ్బంది గాలించిన నేపథ్యంలో చివరికి బోటు కనిపించింది. కానీ అందులో రివీరా లేదు…తన కుమారుడు మాత్రమే ఉన్నాడు. నదిలోకి వెళ్లిన తర్వాత ఇద్దరు ఈతకు వెళ్లినట్లు ఆ పిల్లాడు తెలిపాడు. కానీ ఈత నుంచి తాను బయటకు వచ్చినప్పటికీ అమ్మ రాలేదని తెలిపాడు. దీంతో రివీరా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఐదు రోజులు నదిలో గాలించిన అనంతరం రివీరా మృతదేహం సోమవారం లభ్యమైంది. పాక్స్ మ్యూజికల్ కామెడీ చిత్రం `గ్లీ` ఆరు సీజన్లలోనూ రివీరా పాటలు పాడే చీర్ లీడర్ సంటానా లోపేజ్ పాత్రలో నటించింది.
అయితే ఇక్కడో ప్రత్యేకత ఉంది. గ్లీ లో నటించి ఆత్మహత్య చేసుకున్న 30 ఏళ్ల లోపు మూడవ నటి రివీరా కావడం విశేషం. అంతకు ముందు రివీరా సహనటుడు కొరి మాంటెయిత్ 31 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మాదక ద్రవ్యాల్ని అధికంగా తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అదే చిత్రంలో నటించిన మార్క్ సాలింగ్ తో రివీరా కొన్నాళ్లు సహజీవనం చేసింది. కానీ అతడుపై చైల్డ్ ఫోర్రో గ్రఫీ ఆరోపణలు రుజువు కావడంతో 2018లో ఆత్మహత్య చేసుకు న్నాడు. తాజాగా రివీరా సూసైడ్ తో `గ్లీ లో నటించిన నటులుంతా ఇలా బలవన్మరణానికి ఎందుకు పాల్పడుతున్నారంటూ! బాలీవుడ్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రసారం చేస్తోంది.