Actress: ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ హీరోయిన్ కి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంది. తెలుగులో నటించినది ఒక్క సినిమానే అయినప్పటికీ భారీగా గుర్తింపును తెచ్చుకుంది. నాని హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరే సినిమాలో నటించలేదు. కేవలం ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు హీరోయిన్ నజ్రియా నజీమ్.
ప్రస్తుతం తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది. సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా నజ్రియా నజీమ్ తన భర్త ఫహద్ ఫాజిల్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని తెలిపింది. 2014లో అంజలి రచన దర్శకత్వం వహించిన బెంగుళూరు డేస్ చిత్రంలో నజ్రియా నటించింది. ఇందులో ఫహద్ ఫాజిల్ నజ్రియా భర్తగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాని తర్వాత నిజ జీవితంలో భార్యభర్తలుగా మారిపోయారు.
పెళ్లి తర్వాత ఈ జంట తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే ఫహద్ ఫాజిల్ తెలుగు,మలయాళం, హిందీ వంటి భాషల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్నామధ్య నజ్రియా భర్త ఫహద్ నుంచి విడిపోతుందంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నజ్రియా కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటోంది. మొన్నా ఆ మధ్య సూక్ష్మ దర్శిని అనే సినిమా చేసింది. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నజ్రియా జీవితంలో ఏం జరుగుతుంది అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్న ఒక కార్యక్రమానికి భర్త ఫహద్ ఫాజిల్ తో కలిసి పాల్గొంది. దాంతో రూమర్స్ కు చెక్ పడింది. ఇటీవలే ఓనం కూడా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం నజ్రియా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాలో టోవినో థామస్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే విడాకుల వార్తలు వినిపిస్తున్న సమయంలో ఇలా హీరోతో రొమాంటిక్ సినిమాలు నటించడం అన్నది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
Actress: ఒకవైపు విడాకుల వార్తలు.. మరోవైపు ఆ హీరోతో ఆ పని చేయడానికి సిద్దమైన హీరోయిన్!
