Actress: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఈ సామెత సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి బాగా సరిపోతుందని చెప్పాలి. ఎందుకంటే మంచి క్రేజ్ ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకొని అంతో ఇంతో సంపాదించుకోవాలి. లేదంటే అవకాశాలు కరువై మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం చాలామంది హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతోంది. చాలామంది హీరోయిన్లు సరైన అవకాశాలు లేక ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. కన్నడతో పాటు తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 2019లో కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ మూవీ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్ కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికీ మీకు ఆ హీరోయిన్ ఎవరో అర్థమయ్యే ఉంటుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియాంక మోహన్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలో ఏ సినిమాలో కూడా శృతిమించి ఎక్స్పోజింగ్ చేయలేదు. అయితే నటి ప్రియాంక ప్రస్తుతం అవకాశాలు లేక చాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన జాబిలమ్మా నీకు అంత కోపమా చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే ఇలాగే ఉంటే అవకాశాలు రావు అనుకున్నారు ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు సిద్ధమయ్యింది ప్రియాంక మోహన్. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఇలా ఉంటే కాదు అందాల ఆరబోత చేస్తే తప్ప మీకు అవకాశాలు రావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Actress: అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సక్సెస్‌ఫుల్ హీరోయిన్.. వాటికీ దూరంగా ఉండటం వల్లే అంటూ!
