Actress: తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ మోహిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఇదివరకటి ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే. ఒకప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆదిత్య 369 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
అలా దక్షిణాది భాషల్లో అన్నీ కలుపుకొని దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది. అయితే తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇది ఇలా ఉంటే చాలాకాలం తర్వాత తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చాలా విషయాలను పంచుకున్నారు.. ఈ సందర్భంగా హీరోయిన్ మోహిని మాట్లాడుతూ సినిమాలోని ఒక సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది.
దర్శకుడు ఆర్కే సెల్వమణి కన్మణి (తమిళ సినిమా)లో ఉడాల్ తళువా పాటను స్విమ్మింగ్ పూల్ లో ప్లాన్ చేశాడు. నాకు అసలే ఈత రాదు. అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదని అన్నాను. అప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్ లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలని అన్నారు. అప్పుడు నేను అసలు ఒప్పుకోలేదు. ఆల్‌రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్ గా కనిపించింది ఈ కన్మణి సినిమాలోనే అని చెప్పుకొచ్చింది హీరోయిన్ మోహిని.
Actress: ఇష్టం లేకపోయినా బలవంతంగా సగం బట్టలతో అలా చేయించారు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!
