`ఫైట‌ర్` సెట్‌లో ఏం జ‌రుగుతోంది?

క్రేజీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరిజ‌గ‌న్నాథ్ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. బాలీవుడ్ బిగ్గీస్ క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ‌మెహ‌తా క‌ల‌వ‌డంతో ఈ ప్రాజెక్ట్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్ప‌టికే ముంబైలో షూటింగ్ మొద‌లుపెట్టిన పూరి త‌న స్టైల్లో రాకెట్ స్పీడుతో షూటింగ్ చేసేస్తున్నాడు. ఇటీవ‌ల అర్థ్ర‌రాత్రి ముంబై వీధుల్లో రౌడీతో క‌లిసి అన‌న్య పాండే బైక్‌పై వెళుతున్న ఛేజింగ్ స‌న్నివేశాల్ని షూట్ చేశారు. .

దీనికి సంబంధించిన ఫొటోస్ లీక్ కావ‌డం, సినిమాని ఏ రేంజ్‌లో పూరి రూపొందిస్తున్నాడో తెలిసిపోవ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో రోజు రోజుకి అంచ‌నాలు పెరుగుతున్నాయి. తాజాగా మ‌రో పిక్ లీక్ అయి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెట్‌లో అన‌న్య‌పాండే న‌డుముపై చేతులు వేసి రొమాంటిక్ పొజు ఇస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఫొటో సినిమా ఎంత రొమాంటిక్‌గా వుంటుందో స్పష్టం చేస్తోంది.

ఇద్ద‌రి మ‌ధ్య ఏ రేంజ్‌లో కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవుతోందో తెలిసిపోతోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీస్‌ల‌లో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య కెమిస్ట్రీని పీక్స్‌కు తీసుకెళ్లి చూపించ‌డంలో పూరి సిద్ధ‌మ‌స్తుడు. ఇస్మార్ట్ శంక‌ర్‌లోనూ ఈ ఫార్ములాని వాడిన పూరి `ఫైట‌ర్‌` కోసం కూడా అదే ఫార్ములాని అప్లై చేస్తున్నాడు. సెట్‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య జంట కెమిస్ట్రీ ఇలా వుంటే సినిమాలో ర‌చ్చే అంటున్నారు సినీ వ‌ర్గాలు.