Gaming App: నేను ప్రమోట్ చేసింది రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్, ఈడీ అధికారులు అడిగిన వివరాలు అన్నీ ఇచ్చా – విజయ్ దేవరకొండ

రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ కు, బెట్టింగ్ యాప్స్ కు మధ్య తేడా అందరూ గమనించాలని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తాను ప్రమోషన్ చేసింది రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ కు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజు ఈడీ అధికారుల విచారణకు హాజరైన హీరో విజయ్ దేవరకొండ అధికారులకు అడిగిన వివరాలు అందించారు. అనంతరం మీడియాతో

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, బెట్టింగ్ యాప్స్ వేరు. దీని మధ్య తేడా ఏంటనేది మన మీడియా మిత్రులు ప్రచారం చేయాలి. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, మన ఒలంపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లకు స్పాన్సర్స్ చేస్తుంటాయి. నేను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్ కు. ఇది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్. ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందించాను. నేను ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. దేశంలో ఏది కరెక్ట్ ఏది కాదు అని నిర్ణయించేందుకు సుప్రీం కోర్టు ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి. వారు నిర్ణయిస్తారు. అన్నారు.

పిశాచి కూటమి || Analyst Ks Prasad EXPOSED Smart Meter Issue in AP || AP Power Bills || Telugu Rajyam