మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎందరో అగ్ర తారలు కలిసి నటించిన చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తన తలకు మించిన బాధ్యతగా అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి చాలా మంచి అవుట్ ఫుట్ ను రాబట్టారు. అలా ఈ చిత్రం మెగాస్టార్ ఒక మహా యాగంగా భావించి తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. అయితే మాములుగా సినిమాలలో మన వాళ్ళు అవి అందుకున్న ఫలితాలను బట్టి రెండు కేటగిరీలుగా విడగొట్టుకున్నారు.
అవే 1.”ఓవర్ రేటెడ్ మూవీస్” అలాగే 2.”అండర్ రేటెడ్ మూవీస్”.అయితే ఓవర్ రేటెడ్ మూవీస్ అంటే సినిమాలో ఎలాంటి విషయం లేకపోయినా సరే ఏదొకలా భారీ హైప్ తెచ్చుకొని ఆఖరుకు ఫ్లాప్ జాబితాలో నిలిచిపోతాయి. అలాగే అండర్ రేటెడ్ అంటే అద్భుతమైన కథ, కథాంశాలు ఉండి సరైన టైమింగ్ లో రిలీజ్ కాకపోవడంతో లేక మరికొన్ని ఇతర కారణాల చేత ఫ్లాప్ చిత్రాలుగా నిలిచిపోతాయి. ఇలాంటి వాటిని అండర్ రేటెడ్ మూవీస్ అంటారు.
అయితే వీటిలో ఇప్పుడు “సైరా” చిత్రం ఏ కేటగిరీకి చెందుతుందో చెప్పాలి అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది మంచి రివ్యూస్ వచ్చాయి అన్నిటికి మించి మంచి కంటెంట్ కూడా ఉంది. అయినా సరే ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇలా ఈ చిత్రానికి రెండు కేటగిరీలలో ఉన్న అంశాలు కనిపిస్తున్నాయి. నిజానికి అసలు ఈ చిత్రానికి ఒకరకంగా భారీ హైప్ వచ్చింది అంటే వచ్చింది లేదంటే లేదు. అదేంటో అర్ధం కాదు. అందుకని ఈ చిత్రాన్ని మనం “ఓవర్ అండర్ రేటెడ్ సినిమా” అని మనం పిలుచుకోవచ్చా..
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా హిస్టారికల్ బేస్ ఒక ఉధ్యమకారుడి జీవిత చరిత్ర గురించి తెలుసుకునే చిత్రం. ఇక ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అంటే పెద్దగా ఎవ్వరికీ తెలియదు. అందులోనూ మాస్ పీపుల్‌కి అసలు తెలియదు. కాబట్టి ఇందులోని కథ కథనాలు ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా కొందరికి ఎక్కలేదని పిస్తుంది.