‘ ఆర్ ఆర్ ఆర్ ‘ ఫ్యాన్స్‌కు పూన‌కాలు స్టార్ట్ ఎందుకంటే…?

లాక్ డౌన్ పొడిగిస్తే RRR లాకైన‌ట్టేనా?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమా చేయడానికి రంగంలోకి దిగారంటే పక్కా ప్లాన్ ఉంటుంది. సినిమాని తీయడంలోనే కాదు.. సినిమాని ప్రమోషన్ చేయడంలోను రాజమౌళి స్టైల్ వేరు. బాహుబలి సినిమా ప్రమోషన్ ని రాజమౌళి చేసిన తీరు ఓ అద్భుతమనే చెప్పాలి.. సినిమాపైన అంచనాలు పెంచేందుకు ఒక్కో పాత్రను మెల్లిమెల్లిగా బయటకు వదులుతూ సినిమాపై అటేన్షన్ ని పెంచేసాడు రాజమౌళి.

పీరియాడిక్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించిన నటీ నటుల వివరాలు తప్ప చిత్ర లోగో కానీ హీరోల తాలూకా ఫస్ట్ లుక్ గాని విడుదల చేయకపోయేసరికి అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని దేశ వ్యాప్తంగా అంత ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులు మరో మూడు రోజుల్లో తెరపడబోతున్నట్లు సమాచారం.

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12 గంటలకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ లోగోను రివీల్‌ చేసేందుకు నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాజ‌మౌళి ప్లాన్ మాములుగా లేదుగా. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ప్రమోషన్‌ ప్రారంభించటానికి ఇదే సరైన ముహూర్తం అని ఫిక్స్‌ అయ్యారట. రాజ‌మౌళి ఏం చేసినా సంచ‌ల‌నం అవ్వాల్సిందే అన్న‌ట్లు ఉంటుంది ఆయ‌న ప్లానింగ్ అంతా.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒవిలియా మేరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ పక్కన అలియ భట్ నటిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది 30 జులై న విడుదల చేయనున్నారు. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న నుండి ఈ సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.