మాస్ మహారాజ్ రవి తేజ కెరీర్ అంతగా బాగాలేదని చెప్పాలి. ఆ మధ్య గుడ్డి పాత్రలో చేసిన ‘రాజా ది గ్రేట్’ హిట్ అయినా ఆ తరువాత సినిమాలు నిరాశనే మిగిల్చాయి. దీనితో ఆయన కెరీర్ ప్రశ్నర్ధకం అయింది. అయినా ప్రస్తుతం ఆయనకు ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి చేతిలో.
ప్రస్తుతం RX 100 ‘ చిత్ర దర్శకుడు అజయ్ భూపతితో ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమాకి రవి చాలా ఎక్కువ రెమ్యూనరేషనే అడిగాడట. అంత కుదరదన్న నిర్మాతలకు ఆ సినిమా వదులుకోలేక రెమ్యూనరేషన్ వద్దు లాభాల్లో వాటా ఇవ్వమన్నాడట. ఇది కూడా బాగానే ఉందని సర్లే అన్నారట నిర్మాతలు. ఈ కొత్త పధకం ఎదో బాగానే ఉంది కదూ.