రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 25న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇటీవలె ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చైతన్య కాలేజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ… ‘చైతన్య కాలేజ్‌లోనే కేరింత సినిమా ఫంక్షన్‌ను ప్లాన్ చేశాం. ఈ కాలేజ్ స్టూడెంట్స్‌కే తొలిసారి సినిమా వేశాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సోమవారం నెల్లూరు, మంగళవారం వైజాగ్, బుధవారం మెల్బోర్న్లో స్పెషల్ షోలు వేస్తున్నాం. రెండేళ్ల ప్రయాణమే ఈ సినిమా. డైరెక్టర్ కృష్ణ చెప్పిన ఐడియా నచ్చింది. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నాం కానీ ఓకే కాలేదు. ఇక నావల్ల కాదని డైరెక్టర్‌కి చెప్పేశా. అయితే ఓ రోజు డైరెక్టర్ కృష్ణగారు నాకు ఫోన్ చేసి ఇలా రాజ్‌తరుణ్‌గారిని కలిసి కథ చెప్పాం. ఆయన చేస్తామని అన్నారని చెప్పాడు. హీరోయిన్ విషయంలో ముగ్గురు, నలుగురిని అనుకున్నాం. కానీ శిరీష్ మాత్రం షాలిని పేరును సూచించారు.
షాలిని ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాత లుక్ మరింత బెటర్ అయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫస్టాఫ్ చూసిన తర్వాత నాకు ఎక్కలేదు. ఆ విషయాన్ని డైరెక్టర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించారు. గత నెల ఫైనల్ ప్రొడక్ట్ చూసి డైరెక్టర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చేశాను. నేను ఏదైతే ఫీలయ్యానో నిన్న స్టూడెంట్స్ సినిమా చూసి అలాంటి రెస్పాన్స్‌ను ఇచ్చారు. డిమాండ్ చేసినట్లు కాకుండా కథానుగుణంగా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్..ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇదొక బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ అని కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందన్నారు రాజ్ తరుణ్. పుట్టుక నుండి చివరి వరకు ఇద్దరి వ్యక్తుల జర్నీయే ఈ చిత్రమని డైరెక్టర్ జి.ఆర్.కృష్ణ చెప్పారు.