మునుగోడు ఉపఎన్నిక ఫలితాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే చర్చ జరుగుతోంది. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ వైసీపీనే విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే 2019 స్థాయిలో వైసీపీకి సీట్లు వస్తాయని మాత్రం ఆశిస్తే నిరాశ తప్పదని తెలుస్తోంది. బొటాబొటీ మెజారిటీతోనే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బోగట్టా.
2024 ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు రావాలంటే ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా జగన్ సర్కార్ అడుగులు వేయాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తే మంచిదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసినా కలిసి పోటీ చేసేనా ఫలితాలకు సంబంధించి పెద్ద మార్పు అయితే ఉండదని కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
2024 ఎన్నికల్లో వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన ఏం చేస్తాయో చూడాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చే దిశగా మరిన్ని అడుగులు వేయాల్సి ఉంది.
ప్రజలకు మరింత దగ్గరయ్యే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రజల్లోకి రావడానికి జగన్ ఆసక్తి చూపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.