షర్మిల పాదయాత్రకు అనుమతి.. ఐదు పార్టీలతో కేసీఆర్ కు భారీ నష్టమేనా?

2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ సీఎంగ సులువుగానే ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం సులువు అయితే కాదు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణపై దృష్టి పెట్టడంతో కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. తాజాగా షర్మిల పాదయాత్రకు కూడా అనుమతి లభించింది. అన్ని పార్టీలతో అధికార పార్టీకి విభేదాలు ఉండటంతో ఏ పార్టీ కూడా కేసీఆర్ పార్టీతో పొత్తుకు ఇష్టపడటం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించగా షర్మిల పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనుంది. అన్ని పార్టీలు దృష్టి పెట్టడంతో తెలంగాణ ఎన్నికల ఫలితాలను కూడా అంచనా వేయలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల సైతం ప్రజల్లో మంచి గుర్తింపు రావడంతో సంతోషిస్తున్నారు.

పలువురు రాజకీయ నేతలు కూడా షర్మిల పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. మొత్తం ఆరు పార్టీలు పోటీ చేస్తుండటంతో తెలంగాణలో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేయాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

ఏ మాత్రం పొరపాట్లు చేసినా కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రజలలో వ్యతిరేకత పోగొట్టుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఇతర పార్టీలకు కేసీఆర్ అవకాశం ఇస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.