వాళ్లిద్దరిపై కేసీఆర్ కు కోపం చల్లారదా.. ఆమె వెళ్లిపోవాలంటూ?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని భావించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. టీ.ఆర్.ఎస్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందింది. కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం.

అయితే సీఎం కేసీఆర్ ఇద్దరి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. కారణాలు ఏవైనా ఈ ఇద్దరి పేరు ఎత్తితే కేసీఆర్ సీరియస్ అవుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు నరేంద్ర మోదీ కాగా మరొకరు తెలంగాణ గవర్నర్ తమిళిసై కావడం గమనార్హం. కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే మోదీపై ప్రజల్లో సదభిప్రాయం ఉండటంతో కేసీఆర్ ఎంత కష్టపడినా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే పరిస్థితి లేదు.

మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి ఒక విధంగా నరేంద్ర మోదీ కారణమని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందనే భావనను కేసీఆర్ కలిగి ఉన్నారు. ఈ కారణం వల్లే రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని కేసీఆర్ భావించడంతో పాటు ప్రతి సందర్భంలోనూ మోదీ పాలనపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు గతంలో గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని నామినేట్ చేయడాన్ని తమిళిసై తిరస్కరించడంతో కేసీఆర్ తమిళిసై మధ్య విభేదాలు మొదలయ్యాయి. చాలా సందర్భాల్లో తమిళిసైకి కేసీఆర్ సర్కార్ తగిన గౌరవం ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నిన్న ఎట్ హోం కార్యక్రమం జరగగా తమిళిసై కేసీఆర్ ను ఆహ్వానించినా ఆయన, టీ.ఆర్.ఎస్. మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తమిళిసై వెళ్లిపోతే మాత్రమే కేసీఆర్ కోపం చల్లారుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.