రేవంత్ రెడ్డి గెలుపు కోసం వీరాభిమాని పూజలు

తెలంగాణలో ఎన్నికల పోరు ముగిసింది. ఫలితాల పై ఎవరి అంచనాల్లో వారున్నారు. కార్యకర్తలు, అభిమానులు తమ నేతలు గెలవాలని పూజలు చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి గెలుపొందాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. తాజాగా  కోస్గి మండలం నందిపాడు గ్రామానికి చెందిన రేవంత్ రెడ్డి వీరాభిమాని ఆ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశాడు. ఆంజనేయ స్వామి ముందు రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టి రేవంత్ రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా దీవించాలని కోరుకున్నాడు.

రేవంత్ గెలపు కోసం రేవంత్ ఫోటో పెట్టి పూజలు

వాస్తవానికి అతనికి ఓటు హక్కు లేదు. కానీ రేవంత్ రెడ్డి అంటే పిచ్చి అభిమానమని, రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలవాలని పూజలు చేశాడు. వెనుకబడ్డ  జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ ఇంకా వెనుక బడిన ప్రాంతమని అటువంటిది రేవంత్ రెడ్డి వచ్చాక కొడంగల్ రూపు రేఖలు మార్చాడని ఆయన అన్నారు. తెలంగాణలో కొడంగల్ పేరును ఒక హైలెట్ చేసి దానికి ఇంత పేరు తీసుకువచ్చిన రేవంత్ కు ధన్యవాదాలు అని ఆ అభిమాని అన్నారు.

రేవంత్ రెడ్డి గెలుపొందాలని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి నాయకత్వం రావాలని కోరుకున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఇంకా చాలా మంది చాలా రకాలుగా పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. తన మాటలతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. టిఆర్ఎస్ పాలనను ఎండగడుతూ మాటల తూటాలు రేవంత్ పేల్చాడు. తన  వాక్ చాతుర్యంతో తక్కువ కాలంలోనే పెద్ద లీడర్ గా ఎదిగారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డికి అభిమానులు ఉన్నారు.