పవన్ వర్సెస్ బాలయ్య… బీజేపీ ఒత్తు వెలిగించినట్లేనా?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తనదైన రాజకీయానికి తెరలేపింది. ఇందులో భాగంగా పవన్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేసింది. హుషారుగా ఢిల్లీ వెళ్లినట్లు కనిపించిన పవన్ కల్యాణ్.. అమిత్ షా తో మీటింగ్ అనంతరం మీడియాకు కనిపించకుండా హైదరాబాద్ కి వచ్చేశారు. ఆ సంగతి అలా ఉంచితే… తెలంగాణలో బీజేపీ – జనసేన సీట్ల సర్ధుబాటుకు ఈ ఒక్కరోజే టైం ఇచ్చారని అంటున్నారు.

శుక్రవారం అమిత్ షా హైదరాబాద్ వస్తారని.. ఆ సమయానికి ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంపై పవన్, కిషన్ లు ఒక క్లారిటీకి రావాలని సూచించినట్లు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతుందని అంటున్నారు. ఈ మేరకు ఒక లిస్ట్ పట్టుకుని ములాకత్ కోసం కాసాని సిద్ధమైపోయారని చెబుతున్నారు.

అంటే… బీజేపీ – జనసేన పొత్తుకు వ్యతిరేకంగా టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి దూకబోతుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… టీడీపీ కంటే జనసేన బలహీనంగా ఉన్నప్పటికీ… బీజేపీ మాత్రం జనసేనతోనే పొత్తు పెట్టుకోవడానికి గల కారణం… నౌ బీజేపీ వాంట్స్ ఏ క్రౌండ్ పుల్లర్ అని అంటున్నారు. బీజేపీ సభలకు భారీగా జనం రావాలంటే ఢిల్లీనుంచి పెద్దలు రానవసరం లేదని.. ఆ లోటును పవన్ పూడ్చేస్తారని చెబుతున్నారట!

ఈ నేపథ్యంలో పవన్ సేవలను బీజేపీ… తెలంగాణ రాష్ట్రం మొత్తం వాడేస్తుందని చెబుతున్నారు. అంటే… సుమారు 70 – 100 నియోజకవర్గాల్లో అయినా బీజేపీ తరుపున పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారన్నమాట. ప్రచారం అంటే… అధికార పార్టీని దూషించాలి, మిగిలిన పార్టీల కంటే బీజేపీ బెస్ట్ అని చెప్పాలి. అది ఏ మేరకు జరుగుతుందనేది వేచి చూడాలి.

ఇక మరోపక్క ఏపీలో ఓదార్పు యాత్ర చేద్దామని ప్రకటించిన అనంతరం ఉలిక్కిపడ్డ నారాభిమానులు… బాలయ్యను హైదరబాద్ కి పరిమితం చేసేలా ప్లాన్స్ చేశారు! మరీ అలా డైరెక్ట్ గా చెప్పలేక… తెలంగాణ టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ అనే ట్యాగ్ తగిలించి వదిలారు. అదే జరిగితే… తెలంగాణ ప్రచార కార్యక్రమాల్లో బాలయ్య వర్సెస్ పవన్ కల్యాణ్ పక్కాగా హాట్ టాపిక్ అవుతుందని అంటున్నారు.

ఒకవేళ అదే కాస్త బలంగా జరిగే పరిణామాలు తెలంగాణ ఎన్నికలు ముగిసేలోపు జరిగితే… ఏపీలో పొత్తులో ఉన్న టీడీపీ – జనసేన మధ్య బీజేపీ ఒత్తు వెలిగించి పెట్టేసినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!